ETV Bharat / state

సీఎం కీలక నిర్ణయం.. ఐఏఎస్​లతో పరిపాలనా సంస్కరణల కమిటీ.. - నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ

Administrative Reforms Committee
సీఎం కీలక నిర్ణయం
author img

By

Published : Jan 16, 2022, 9:20 PM IST

Updated : Jan 16, 2022, 10:03 PM IST

21:19 January 16

Administrative Reforms Committee: నలుగురు ఐఏఎస్‌లతో పరిపాలనా సంస్కరణల అధ్యయన కమిటీ

Administrative Reforms Committee: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మరింత అద్భుతమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పరిపాలన సంస్కరణలు సూచించేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల అవసరం, వివిధ శాఖల్లో ఒత్తిడి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం, సాంకేతికత వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం ఆదేశించారు.

Committee with IAS officers: రాష్ట్రంలో ఉద్యోగుల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు పరిశీలనకు కమిటీ పని చేస్తుందని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి ఆధ్వర్యంలో సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య కమిటీలో సభ్యులుగా సీఎం నియమించారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు

employees adjustment: రాష్ట్రంలో పలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల కేటాయింపు, పరిపాలన సంస్కరణలపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38 వేల 643 మంది ఉద్యోగులను జిల్లాలలో సర్దుబాటు చేయగా.. 101 మంది మినహా 38 వేల 542 మంది వారికి కేటాయించిన స్థానాల్లో చేరారని సీఎంకు అధికారులు వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలను సూచించాలని కమిటీని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్నందున. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఇంకా మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి తెలిపారు.

cm kcr committee on administration: రాష్ట్రంలో ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలో అధ్యయనం చేయాలని కమిటీని సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాలు, మండలాల్లో వివిధ శాఖల పని ఒత్తిడిని అంచనా వేసి.. కొత్త పోస్టుల అవసరాన్ని గుర్తించడంతో పాటు.. సాంకేతికంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో కూడా సిఫార్సు చేయాలని కమిటీకి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. మరింత మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై తగు సూచనలు ఇవ్వాలని కమిటీకి సీఎం సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jan 16, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.