ETV Bharat / state

వానాకాలం పంటల సాగులో కొద్దిపాటి మార్పులే: సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​

రాష్ట్ర వ్యాప్తంగా ఏ క్లస్టర్లో ఏ పంట సాగు చేయాలనే విషయంపై నిర్ణయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. సర్కారు నిర్ణయాలను రైతులకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు జూన్ 1 నుంచి వర్షాకాలం పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

CM KCR latest NEWS
CM KCR latest NEWS
author img

By

Published : May 27, 2020, 11:57 PM IST

ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సీఎం బుధవారం ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు.

గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. ఈ వర్షాకాలంలో మక్కలు వద్దని మాత్రమే అన్నదాతలకు చెప్పామన్నారు. మక్కల స్థానంలో కందులు లేదా పత్తి సాగుచేయాలని సూచించినట్లు తెలిపారు. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని కోరాం. కాకపోతే మార్కెట్​లో డిమాండ్ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశామని సీఎం తెలిపారు.

గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ సారి మరో 10-15 లక్షలు పెంచమన్నామని కేసీఆర్​ చెప్పారు. మిగతా పంటల విషయంలో ఎలాంటి మార్పులు సూచించలేదన్నారు. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారని సీఎం తెలిపారు.

సర్కారు నిర్ణయాలను రైతులకు చేరవేయాలి....

ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంపై నిర్ణయం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సర్కారు నిర్ణయాలను రైతులకు చేరవేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా తయారు చేసిన ప్రణాళికను వెంటనే ఆయా జిల్లాలకు పంపాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం అవ్వాలని సీఎం స్పష్టం చేశారు . జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందించిన ప్రణాళిక ఇవ్వాలన్నారు. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు సమావేశం నిర్వహించి.... క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో ఏఈవోలకు వివరించాలని సూచించారు. తర్వాత ఏఈవోలు రైతులకు తెలియజేయాలని తెలిపారు .

కల్తీ విత్తనాలపై నిఘా పెంచాలి...

ప్రభుత్వం సూచించిన ప్రకారం పంటలు సాగు చేసే విధంగా రైతులను సమన్వయ పరచాలని అధికారులకు సీఎం సూచించారు. క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో నిర్ణయం జరిగింది కాబట్టి, దానికి అనుగుణంగా గ్రామాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. కల్తీ,నకిలీ విత్తనాల విషయంలో నిఘా పెంచాలని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.