ETV Bharat / state

మళ్లీ అందుకున్న వానలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం.. - TELANGANA RAINS NEWS

CM KCR REVIEW: వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Jul 22, 2022, 8:48 PM IST

Updated : Jul 22, 2022, 9:44 PM IST

20:46 July 22

వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

Heavy Rains in Telangana: గత మూడు, నాలుగు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు.. ఈరోజు ఉదయం నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు మళ్లీ ఉప్పొంగుతున్నాయి. రహదారులన్నీ మినీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.

ఈ క్రమంలోనే వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్​కుమార్​, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, వరద ప్రాంతాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.

ఇవీ చూడండి..

మళ్లీ దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

భాగ్యనగరంపై మళ్లీ వరుణుడి ప్రతాపం.. లోతట్టు ప్రాంతాలు ఆగమాగం..!

CBSE టెన్త్ క్లాస్ రిజల్ట్స్​ రిలీజ్.. 'ఈ సారి మెరిట్​ లిస్టు లేదు'

Last Updated : Jul 22, 2022, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.