ETV Bharat / state

పీవీకి భారతరత్న ఇవ్వాలి... పార్లమెంటులో చిత్రపటం పెట్టాలి: కేసీఆర్ - సీఎం కేసీఆర్​ వార్తలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు కేసీఆర్ తెలిపారు. పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించారు. కేశవరావు నేతృత్వంలోని పీవీ శతజయంతి కమిటీ సభ్యులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

cm kcr review on pv narasimha rao birth anniversary in hyderabad
పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్​
author img

By

Published : Jun 23, 2020, 7:36 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునేలా.. చిరస్మరణీయంగా నిలిచేలా.. శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై అధికారులతో సీఎం సమీక్షించారు. పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్​లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఈ కార్యక్రమాల పర్యవేక్షించనున్నారు.

రూ.10 కోట్లు కేటాయింపు

ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. పీవీ జయంతిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. పీవీ తెలంగాణ ఠీవి అని.. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉందన్నారు. ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలని పేర్కొన్నారు.

పీవీ మెమోరియల్

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్​లో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్నారు. కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి, పీవీ మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలని కోరారు. పీవీ ఫొటోలు సేకరించి భద్రపరిచి ఎగ్జిబిషన్ నిర్వహించాలన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరల్​తోపాటు దిల్లీలోని తెలంగాణ భవన్​లో పీవీ కాంస్య విగ్రహాలను నెలకొల్పాలని చెప్పారు.

అసెంబ్లీలో పీవీ చిత్రపటం

అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని పెట్టాలని అధికారులను ఆదేశించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్ తీయాలని చెప్పారు. వివిధ రంగాల్లో చేసిన కృషికి.. ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలన్నారు. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయని.. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది? అనే విషయాలను పొందు పరుస్తూ ప్రత్యేక సంచికను ఆర్థిక నిపుణులతో రాయించాలన్నారు.

విద్యారంగంలోనూ విశిష్ట సేవ

విద్యారంగంలో కూడా పీవీ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు సీఎం. సర్వేల్​లో పెట్టిన మొదటి రెసిడెన్షియల్ స్కూల్ దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పిన ఘనత పీవీకే దక్కిందన్నారు. పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు, దేశ గతిని మార్చిన గొప్పనేత, భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడని కేసీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి పీవీకి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తానని చెప్పారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానిస్తామని తెలిపారు. పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు.

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.