ETV Bharat / state

లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూపై సీఎం కేసీఆర్ సమీక్ష - లాక్​డౌన్​ అమలు తీరుపై ముఖ్యమంత్రి సమీక్ష

cm-kcr-review-on-lock-down-and-night-curfew
లాక్​డౌన్​ అమలు తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
author img

By

Published : Mar 25, 2020, 11:27 PM IST

Updated : Mar 26, 2020, 2:21 AM IST

23:12 March 25

లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా లాక్‌ డౌన్‌ విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా నివారణకు "సామాజిక దూరానికి మించిన మార్గం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీస్, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతోనూ ఫోన్​లో పలు వివరాలపై ఆరా తీశారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, వ్యాధి లక్షణాలు కనిపించినా పరీక్షలకు తరలిరావాలని ప్రజలకు సూచించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తోన్న పోలీసులు, వైద్యులు, సానిటరీ సిబ్బందిని సీఎం ప్రశంసించారు. సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Last Updated : Mar 26, 2020, 2:21 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.