ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. నీటి లభ్యత సమయంలో ప్రతిరోజూ నీటిని తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పారు. నీటి తరలింపు ద్వారా కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందలన్నారు.
బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టులకు ఆర్థిక సాయానికి సంబంధించి వివిధ సంస్థలతో ఒప్పందాలు పూర్తైనట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం పూర్తికాగానే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలన్నారు.
ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన