ETV Bharat / state

KCR review: ఈనెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు - telangana varthalu

cm kcr review
గ్రామ పంచాయతీలు, పురపాలికల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం కేసీఆర్​ సమీక్ష
author img

By

Published : Jun 11, 2021, 6:59 PM IST

Updated : Jun 11, 2021, 10:31 PM IST

18:57 June 11

KCR review: ఈనెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు

   పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమయ్యారు. ఈ నెల 19  తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. జూన్ 13న జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు.  

   సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముందస్తు ప్రణాళిక సంస్కృతిని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సీఎం తెలిపారు. కరోనా తగ్గాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం

Last Updated : Jun 11, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.