ETV Bharat / state

నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు: కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ వార్తలు

రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం సహా అన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రైతు శ్రేయస్సే కేంద్రబిందువుగా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కోటి 30 లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండే దిశగా పురోగమిస్తోన్న తెలంగాణ వ్యవసాయరంగ ఉజ్వల ప్రస్థానానికి... నియంత్రిత సాగు నాంది పలుకుతుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

cm kcr review on agriculture in hyderabad
నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు: సీఎం కేసీఆర్​
author img

By

Published : Jun 16, 2020, 3:26 AM IST

Updated : Jun 16, 2020, 6:59 AM IST

నియంత్రిత సాగు కేవలం ఒక పంట, ఒక సీజన్ కోసమో ఉద్దేశించిన విధానం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో వస్తోన్న వ్యవసాయ విప్లవం నేపథ్యంలో ముందు చూపుతో అనేక సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్రబిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. వ్యవసాయ సమృద్ధి కలిగిన రాష్ట్రంగా రూపుదాలుస్తున్న తెలంగాణ నుంచి భారత ఆహారసంస్థ... 64 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని గుర్తుచేశారు.

వ్యవసాయ రంగంలో ఉజ్వల ప్రస్థానానికి ఇది నాంది

తెలంగాణ అభివృద్ధిని ఎఫ్​సీఐ ఛైర్మన్ స్వయంగా అభినందించారని... తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది అనడానికి పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి తార్కాణమని సీఎం చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తై కోటి 30 లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండించే దిశగా రాష్ట్రం పురోగమిస్తోందని అన్నారు. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉజ్వల ప్రస్థానానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు.

పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలు

పంజాబ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించిందన్న ముఖ్యమంత్రి.. పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడం వల్ల అక్కడ వ్యవసాయ వైపరీత్యం సంభవించిందని గుర్తు చేశారు. పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసి అటువంటి సమస్యలేవీ ఉత్పన్నం కాకుండా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసినట్లు వివరించారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలి

నియంత్రిత సాగు ద్వారా బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించడం వల్ల కొనుగోలు, మద్దతు ధర సమస్య తలెత్తదని చెప్పారు. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినదని, బ్యాక్టీరియా తిష్టవేయదని... తద్వారా చీడపీడలు, తెగుళ్లకు ఆస్కారం ఉండదన్నారు. నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుందన్న సీఎం.... భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదని వివరించారు.

ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి

నియంత్రిత సాగు విధానంతో పాటు, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన పెరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వేసిన ఎరువంతా వినియోగం కాకపోవడం వల్ల భూమిలోనే భాస్వరం నిల్వలు పేరుకుపోతున్నాయని... దాన్ని తొలగించేందుకు పాస్పేట్ సాలబుల్ బ్యాక్టీరియాను వదలడం ద్వారా భూసారాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ఇలాంటి విధానాలను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతో పాటు, మార్కెట్లోకి క్రమపద్ధతిలో సరకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోధన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయని వివరించారు.

పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు ఏర్పాటు

గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇతర వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మిల్లింగ్ వ్యవస్థ పెరగటంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని అన్నారు. అందుకనుగుణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు.

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

Last Updated : Jun 16, 2020, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.