ETV Bharat / state

వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ధనికులుగా మారాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్షలాది మంది రైతులు, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు మొండి పట్టుదల, నిరంతర పరిశ్రమతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

cm kcr review on agriculture at pragathi bhavan in hyderabad
వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం
author img

By

Published : Jul 22, 2020, 5:53 PM IST

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం స్వతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణలో జరుగుతోందని సీఎం అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించి.. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నామన్న ఆయన... నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా పెట్టుబడిసాయం అందిస్తున్నామని వివరించారు. ఐదు లక్షల రూపాయల రైతుబీమా కల్పించటంతోపాటు కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసిందని చెప్పారు.

రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి

రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే రైతుబంధు సమితులు ఏర్పాటు చేసిందన్న కేసీఆర్... క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి అవుతుందని తెలిపారు. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయని.. ముఖ్యమంత్రితోపాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారాలని... అంతిమంగా రైతులు ధనికులుగా మారాలని స్పష్టం చేశారు. అందుకోసమే ఎంతో వ్యయంతో ప్రభుత్వం చేస్తోన్న అనేక ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు.

సంస్థాగతంగా బలోపేతం కావాలి

గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని... అందుకు తగ్గట్లు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలన్న కేసీఆర్... ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి... వాటిని తెలంగాణలో అమలు చేయాలని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలని, యాంత్రీకరణ పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సింగిల్ పిక్ క్రాప్స్​ను అధ్యయనం చేయాలని చెప్పారు. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా పండే పంటలు, వాటి సాగు పద్ధతులు తెలుసుకోవాలన్నారు. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలన్న సీఎం... రాష్ట్రం, దేశం, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేయాలని చెప్పారు.

వసాయ శాఖ ప్రత్యేక విభాగాల ఏర్పాటు

ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలని... మార్కెట్​ను అధ్యయనం చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు అందించేలా పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ఒక్కో విభాగానికి ఒక్కో అదనపు సంచాలకుడిని నియమించాలని ఆదేశించారు. పెరిగిన సాగు విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాలన్నారు.

నియంత్రిత పద్ధతిలో వందకు వంద శాతం

మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారు. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేసి దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలిని సీఎం ఆదేశించారు. రాష్ట్ర రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారన్న సీఎం... అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారని ప్రశంసించారు. వానాకాలంలో మొక్కజొన్న లాభదాయకం కాదంటే... ఎవ్వరూ వేయలేదన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో కచ్చితమైన వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తుల వల్ల ఏర్పడే ఆకలి సమస్య యుద్ధం కన్నా ఎక్కువ విలయం సృష్టిస్తుందన్నారు. దేశం ఎప్పుడూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలని కేసీఆర్ అన్నారు. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నించాలన్నారు.

ఇదీ చదవండి: లేహ్​ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.