ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు వెళ్లిన సీఎం... సోమవారం శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ఆయనతో కేసీఆర్ భేటీ అయ్యారు.
దీనిని మర్యాదపూర్వక భేటీగా తెరాస వర్గాలు చెబుతుండగా... జాతీయ పరిణామాలు, దేశ రాజకీయాలు, పాలనాపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. నదీ జలాల వివాదాలు, ఆహార ధాన్యాల సేకరణ విధానం, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా ఇతర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలిసింది. మూడ్రోజుల పర్యటన అనంతరం, కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఇదీ చదవండి: