రైతుల కోరిక మేరకు వానాకాలం దృష్ట్యా ఎస్సారెస్పీ వరదకాల్వను కాళేశ్వరం జలాలు వదలాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వరదకాల్వలోని సాగునీటి ద్వారా ఆయకట్టు రైతులకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతుందని ప్రశాంత్ రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఆదేశాల నేపథ్యంలో
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. రైతుగా సాగునీటి కష్టాలు, అవసరాలు తెలిసినందునే వెంటనే సహృదయంతో స్పందించారని అన్నారు. రైతు కష్టాలు తన కష్టంగా తల్లడిల్లే వ్యక్తి సీఎంగా ఉండటం రైతాంగం అదృష్టమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఎస్సారెస్పీ వరద కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అప్రమత్తం కావాలన్నారు. సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఆయకట్టు రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి : ఎన్పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్