ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 లోపు బేషరుతుగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశమిస్తున్నట్లు తెలిపిన సీఎం.... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటూనే.. ప్రైవేటు బస్సులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేరిస్తే... మరో 91 కార్పొరేషన్లు విలీనం అడుగుతాయన్న కారణంతోనే... విలీనాన్ని మంత్రివర్గం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందని వెల్లడించారు. నవంబర్ 5 అర్ధరాత్రిలోపు విధుల్లోకి చేరని వారిని తర్వాత తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 5 తర్వాత పరిస్థితి చూసి మరో 5 వేల రూట్లను ప్రైవేటుకు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..