జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడపబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తిగా కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులు కూడా రావొద్దని సీఎం తెలిపారు. పక్క రాష్ట్రాల బస్సులను 24 గంటల పాటు రాష్ట్రంలోకి రానివ్వమన్నారు.
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సేవలు అందించడానికి డిపోకు ఐదు బస్సులు సిద్ధంగా ఉంటాయని సీఎం పేర్కొన్నారు.