ETV Bharat / state

360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ : కేసీఆర్​ - పీవీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్​ వార్తలు

తాను ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని ముఖ్యమంత్రి కేసీఆర్​ కొనియాడారు. ఆయన వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చెప్పిన మహా వ్యక్తి పీవీ అని అభివర్ణించారు.

cm kcr on pv narasimha rao
పీవీ 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి: కేసీఆర్​
author img

By

Published : Jun 28, 2020, 11:42 AM IST

Updated : Jun 28, 2020, 12:22 PM IST

360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని ముఖ్యమంత్రి కేసీఆర్​ కొనియాడారు. ఆయన వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకని పీవీ ఘాట్​ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

పీవీ నరసింహరావు నిరంతర సంస్కరణ శీలి అని సీఎం పేర్కొన్నారు. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనమన్నారు. పీవీ ఏ రంగంలో ఉంటే.. ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారన్న ముఖ్యమంత్రి.. ఆయన జీవిత ప్రస్థానమంతా సంస్కరణలతో సాగిందని తెలిపారు. తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చెప్పిన మహా వ్యక్తి పీవీ అని కొనియాడారు.

ప్రధాని పదవిని ముఠాలు కట్టి తెచ్చుకోలేదు..

ప్రపంచ దేశాలకు ఉత్తమ సందేశాలు ఇచ్చిన వ్యక్తి పీవీ అని సీఎం కొనియాడారు. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారన్నారు. ప్రధాని పదవిని ముఠాలు కట్టి తెచ్చుకోలేదని.. ఆయనను వరించి వచ్చిందని తెలిపారు. మన్మోహన్‌ సింగ్​ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మనందరం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు పీవీనే కారణం అన్నారు. ఆయన విజ్ఞాన సముపార్జన చేసి.. ఆ వెలుగులను ప్రపంచానికి అందించారని వివరించారు.

ఇదీచూడండి: 'పీవీ.. భరతమాతకు గర్వకారణమైన పుత్రరత్నం'

Last Updated : Jun 28, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.