తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ మాసం వేతనాలలో కోత కొనసాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వైద్య ఆరోగ్య, పురపాలక పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ప్రకటించిన ప్రోత్సాహకం అదే విధంగా ఉంటుందని.. పోలీసు సిబ్బందికి అదనంగా 10 శాతం వేతనాన్ని కానుకగా ఇస్తామని సీఎం తెలిపారు.
విద్యుత్ నిర్వహణ సిబ్బంది, కార్మికులకు యథాతథంగా వేతనాలుంటాయని ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 34, 512 మంది.. నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారని.. కేసీఆర్ పేర్కొన్నారు.
లాక్‌డౌన్ వేళ అత్యవసర శాఖలను.. అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సి ఉంటుందని.. వారి సేవలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఇవీ చూడండి: ఎలాంటి సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్‌డౌన్: కేసీఆర్