రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గాంధీలో 308 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మర్కజ్ వెళ్లిన వారిలో ఇప్పటివరకు 1089 మందిని గుర్తించామన్నారు. 30 నుంచి 35 మంది దిల్లీలోనే ఉన్నారని చెప్పారు.
మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వీరి ద్వారా 93 మందికి వైరస్ సోకిందన్నారు. చనిపోయిన వారందరూ మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని స్పష్టం చేశారు.