ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్, (cm kcr delhi tour) మంత్రులు, అధికారులు దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ,(cm kcr meet pm modi) జలవనరులశాఖ మంత్రితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు సీఎం కేసీఆర్ హస్తినలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం(cm kcr reached begumpet airport) నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్య అధికారులతో కలిసి దిల్లీ పర్యటనకు వెళ్లారు.
కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో ( cm kcr meet central ministers) సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ధాన్యం సేకరణపై కేంద్ర నుంచి స్పష్టత కోరనున్నారు. అలాగే కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, రాష్ట్ర విభజన అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో సీఎం
ఇటీవల వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆయన మండిపడ్డారు. వరి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనల్లో మంత్రులు, తెరాస నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోళ్లపై భాజపా నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రివర్గంలో నిర్ణయం
ధాన్యం కొనుగోళ్ల విషయమై శనివారం మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. దిల్లీ వెళ్లి తేల్చుకోవాలని సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రంతో తేల్చుకునేందుకే ఇవాళ మంత్రులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.
ఇదీ చూడండి: