ETV Bharat / state

'60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేయాలి' - సీఎం కేసీఆర్​ సమీక్ష తాజా వార్తలు

రాష్ట్రంలో ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంటసాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచించారు. వర్షాకాలంలో మొక్కజొన్న సాగు లాభసాటి కాదని.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి సాగు శ్రేయస్కరమని సూచించారు. వానాకాలం పంటగా పది నుంచి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయడం మంచిదని తెలిపారు. నిపుణుల సూచనలపై రెండు రోజుల పాటు చర్చించి నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ నెల 18న కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తారు.

'60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేయాలి'

author img

By

Published : May 16, 2020, 4:06 PM IST

సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. వర్షకాలం పంటనుంచే నియంత్రిత విధానంలో వరిసాగు చేపట్టాలని నిర్ణయించగా.. వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాగుభూమి, సాగు పద్ధతులు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనం చేసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రెండు పంటలకు కలిపి 65 లక్షల ఎకరాల్లో సాగు:

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని నిపుణులు సూచించారు. వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని... రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలని స్పష్టం చేశారు. 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలని సూచించారు.

వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకమని... గతంలో పత్తి పంటను వర్షాల మీద ఆధారపడి సాగు చేశారని నిపుణలు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడం వల్ల కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తి సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు. నాణ్యమైన పత్తి వస్తుందన్న నిపుణులు... వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించారు.

65-75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..

రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరమని సూచించారు. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. కందులకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని... వర్షాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు ఉత్తమమని తెలిపారు. వర్షాకాలంలో మొక్కజొన్న అసలు పండించకపోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచించారు. వర్షాకాలంలో మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని.. అదే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుందని వివరించారు.

వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కల సాగు వద్దన్న నిపుణులు... మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేనందున రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు యాసంగిలో మాత్రమే సాగు చేసుకోవడం మంచిదని సూచించారు. రైతులు ఎవరైనా తమ సొంత అవసరాల కోసం వర్షాకాలంలో మక్కలు పండించుకోవడం వారి వ్యక్తిగతమని.. వ్యాపార పంటగా మాత్రం మంచిది కాదని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ ఉన్నందున రైతులు నష్టపోరాదని ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేస్తోందని... ప్రతిసారి ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని రైతులకు సూచించారు.

ఈ నెల 18కి వాయిదా..

నిపుణుల సూచనలపై రాబోయే రెండు రోజుల పాటు చర్చించాక రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో సాగు విధానాన్ని ఖరారు చేస్తుంది. ఆ తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తారు. రైస్ మిల్లర్లతో చర్చలు అసమగ్రంగా ఉండడం, పంటల విస్తీర్ణానికి సంబంధించి తుది నిర్ణయం జరగనందున శుక్రవారం జరగాల్సిన దృశ్యమాధ్యమ సమీక్ష వాయిదా పడింది. ఈ నెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా... కలెక్టర్లు, వ్యవసాయఅధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులతో మాట్లాడతారు.

ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.