ETV Bharat / state

ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్

CM KCR Interesting Comments: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయేనని విమర్శించారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం.. మోదీ హయాంలో 5.1 శాతం అని పేర్కొన్నారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

author img

By

Published : Feb 12, 2023, 4:44 PM IST

Updated : Feb 12, 2023, 4:59 PM IST

CM KCR
CM KCR
ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్

CM KCR Interesting Comments: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు ఉందా అని ప్రశ్నించారు. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతం.. మోదీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.1 శాతం అని పేర్కొన్నారు. అప్పు చేయడంలో మోదీని మించిన ప్రధాని లేరని ఎద్దేవా చేశారు. డెట్‌ టు జీడీపీ మోదీ హయాంలో పెరిగిందని.. ఇది ఎవరూ కాదనలేని సత్యం అని స్పష్టం చేశారు.

మన్మోహన్ హయాంలో డెట్‌ టు జీడీపీ 52.2 శాతం.. మోదీ హయాంలో 56.2 శాతం అని కేసీఆర్ పేర్కొన్నారు. మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం.. మోదీ హయాంలో 31 శాతం అని వివరించారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం.. మోదీ హయాంలో 5.1 శాతం అని వెల్లడించారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే: మేకిన్ ఇండియా, విశ్వగురు ఎటుపాయే అని కేసీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. మన్మోహన్‌ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.87 శాతం.. మోదీ హయాంలో 3.27 శాతం అని తెలిపారు. మన్మోహన్ కాలంలో రూపాయి విలువ 58.6 అయితే.. మోదీ హయాంలో 82.6 అని వివరించారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో ఆయన లైసెన్స్‌ రాజ్‌.. మోదీ హయాంలో సైలెన్స్‌ రాజ్‌ అని ఎద్దేవా చేశారు.

ఎన్‌డీఏ అంటే.. నో డాటా ఎవైలబుల్: కేంద్రం రూ.20 లక్షల కోట్లు ఎంఐఎంఈలకు ఇచ్చామన్నారని.. అవి ఎక్కడకు పోయాయో తెలియదని కేసీఆర్ ఆరోపించారు. ఎన్‌డీఏ అంటే.. నో డాటా ఎవైలబుల్ అని చిదంబరం వ్యంగ్యంగా అన్నారని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మోదీ ఫోటో కోసం రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా అని ప్రశ్నించారు. ఏం సాధించారని మోదీ ఫొటో పెట్టుకోవాలని అన్నారు. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు ఎందుకు వేయాలి? అని వివరించారు.

కేంద్రం తీరుతో రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో తాను మోదీని సమర్థించానని గుర్తు చేశారు. నోట్ల రద్దు వేళ తాను మోదీని కలిసి చెప్పింది వేరు.. మోదీ చేసింది వేరని వివరించారు. కొందరు భయంతో మాట్లాడకపోవచ్చు.. అందరికీ భయం ఉండదు కదా అని అన్నారు. ఒకే ఒక్క వందేభారత్‌ రైలును మోదీ ఇప్పటికి 14 సార్లు ప్రారంభించారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

"మన్మోహన్ హయాంలో డెట్‌ టు జీడీపీ 52.2 శాతం.. మోదీ హయాంలో 56.2 శాతం. మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం.. మోదీ హయాంలో 31 శాతం. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77.. మోదీ హయాంలో 5.1 శాతం. నేను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా నేను రాజీనామా చేస్తా." - కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి: 'మన్మోహన్ పాలనతో పోలిస్తే.. మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది'

జీహెచ్​ఎంసీ పరిధిలో త్వరలోనే 1,540 ఆశా పోస్టుల భర్తీ: హరీశ్​రావు

ముఖ్యమంత్రి ఇంటి పక్కనే భారీ అగ్ని ప్రమాదం..

Last Updated : Feb 12, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.