పోడు భూములపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్(CM KCR Review on podu lands)... ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడుభూముల సమస్య పరిష్కారంపై సమీక్షిస్తున్న సీఎం(CM KCR Review on podu lands)... అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చిస్తున్నారు. పోడు సమస్య అధ్యయనం కోసం మూడు రోజులపాటు జిల్లాల్లో పర్యటించిన అధికారులు బృందం... క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వనున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణపై చర్చిస్తున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు... హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: kishan reddy : హుజూరాబాద్ తీర్పు.. రాష్ట్రంలో అధికార మార్పునకు సంకేతం కాబోతోంది