ETV Bharat / state

దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా మరెన్నో కార్యక్రమాలు: సీఎం కేసీఆర్ - cm kcr latest news

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్​ వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందని స్పష్టం చేశారు.

దివ్యాంగులకు దళితబంధు, ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్

author img

By

Published : Dec 3, 2022, 2:09 PM IST

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని వారికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేడన్న సీఎం కేసీఆర్.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతోనే మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం, దళితబంధు పథకాలతో పాటు.. ఇతర పథకాలలో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్​ను అమలు చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్​లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందని స్పష్టం చేశారు.

ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేడు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలి. దళితబంధు, ఇతర పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. - సీఎం కేసీఆర్‌

ఇవీ చూడండి..:

ప్రగతిభవన్​కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సీఎంతో చర్చ..!

హెచ్​సీయూలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.