సీఎం కేసీఆర్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీని కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుతో పాటు... రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై ప్రధానితో చర్చిస్తానని ఇటీవల సీఎం వెల్లడించిన విషయం విదితమే. విభజన హామీలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటివి కూడా ప్రస్తావించే జాబితాలో ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రులతోనూ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసే అవకాశం ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్‌శర్మ ఇంట్లో జరిగే వివాహ విందులో కేసీఆర్ పాల్గొననున్నారు. మంగళవారం రాత్రి లేదా.. బుధవారం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'