ETV Bharat / state

KCR on yasangi: 'యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాల్సిందే' - యాసంగి కొనుగోళ్లపై ప్రభుత్వం

KCR on yasangi: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఆ దిశగా రేపు కార్యాచరణ ఖరారు చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రుల బృందం దిల్లీ పయనం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని ఎఫ్​సీఐ పూర్తిగా సేకరించేలా కేంద్రంతో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది

KCR on yasangi
ముఖ్యమంత్రి కేసీఆర్‌
author img

By

Published : Mar 20, 2022, 5:36 AM IST

KCR on yasangi: యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాకా వదలబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రైతులకు జీవన్మరణ సమస్యగా మారిన దీని పరిష్కారానికి ఎంతవరకైనా వెళ్తామని, కేంద్రంతో యుద్ధానికి సిద్ధమేనని చెప్పారు. కేంద్రం వెంటనే వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, పంజాబ్‌ తరహాలో ఇక్కడి ధాన్యాన్ని 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలనే డిమాండ్‌తో తెరాస ఉద్ధృతంగా పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని, పార్లమెంటులో ఎంపీలు ధర్నాలు చేస్తారన్నారు. తాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి దిల్లీలోనూ ధర్నాకు వెనుకాడబోమని తెలిపారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండుతో చేపట్టే నిరసన కార్యక్రమాల రూపకల్పనపై సోమవారం ఉదయం 11.30కు తెలంగాణభవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో కార్యాచరణ ఖరారు అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు దిల్లీకి బయలుదేరి వెళ్తుందని, కేంద్రమంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్‌ చేస్తామన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తమ నివాసంలో సీఎం కేసీఆర్‌ శనివారం మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల సమస్యను సీఎం సమీక్షించి కార్యాచరణపై మాట్లాడారు.

‘‘తెలంగాణలో వరికోతలు మొదలయ్యాయి. తిండిగింజలు, సొంత అవసరాలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవి గాక 45-50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. సేకరించినప్పటికీ గోదాముల సమస్య వల్ల నిల్వ అసాధ్యం. రాష్ట్రానికి ఎఫ్‌సీఐ తరహా సంస్థ లేదు. రవాణా కూడా ఇబ్బందికరం. అందువల్ల కేంద్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకురావాలి.కానీ, కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. ఇప్పటివరకు కొనుగోళ్లపై ఎలాంటి సమాచారం లేదు. కేంద్రం, రాష్ట్రంలోని భాజపా నిర్వాకం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. వానాకాలం పంట కొనుగోళ్లలోనూ కేంద్రం కిరికిరి చేసింది. నాతో పాటు మంత్రులందరూ దిల్లీ వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల టన్నుల ధాన్యం ఇంకా నిల్వ ఉంది. ఇప్పుడు 50 లక్షల టన్నులతో కలిస్తే దాదాపు 55 లక్షల టన్నులు కేంద్రం కొనుగోలు చేయాలి. పార్లమెంటును స్తంభింపజేస్తాం. రాష్ట్రంలోనూ తెరాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తాం. ఇందులో రైతులను భాగస్వాములను చేస్తాం. నల్లచట్టాలపై యుద్ధం స్థాయిలో తెలంగాణ ధాన్యం రైతుల సమస్యపైనా సమరం సాగిస్తాం. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా మన ఎంపీలు వీరోచిత పోరాటం చేశారు. ఈ సమావేశాల్లో అంతకంటే రెట్టింపు స్థాయిలో పోరాడదాం. లోక్‌సభ, రాజ్యసభల్లో ధర్నాలు జరపాలి. తెలంగాణ విషయంలో కేంద్ర వైఫల్యాలు, ధాన్యం రైతులపై వివక్షను ఎండగడదాం. అవసరమైతే ఇతర పార్టీలనూ కలుపుకొని వెళ్దాం. ధాన్యం కొనుగోలు సమస్యగా మారుతుందని మేం ముందే రైతులను అప్రమత్తం చేశాం. ఈ తరుణంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరి వేయాలని, మెడలు వంచి కొనిపిస్తామని చెప్పారు. దీంతో వరిసాగు ఎక్కువైంది. ఇప్పుడు ఇంత ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఏమాత్రం లేదు. అందుకే ఈ పోరాటం." - సీఎం కేసీఆర్

తెరాస శ్రేణులు సన్నద్ధం కావాలి

కేంద్రంపై పోరాటానికి తెరాస శ్రేణులు సన్నద్ధం కావాలి. ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలే. రైతులకు సంఘీభావంగా వీధుల్లోకి వచ్చి పోరాడదాం. ఈ నెల 21న జరిగే సమావేశంలో వారికి ఆందోళన పథాన్ని నిర్దేశిస్తాం. ఆ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలి’’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఎంతదాకా అయినా వెళ్తాం

వానాకాలం పంట సమయంలోనే పంజాబ్‌ తరహాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాం. ధాన్యం దిగుబడిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్‌ తరహా విధానం అమలు చేయడానికి కేంద్రం ముందుకు రావడంలేదు. తెలంగాణకు అన్నింటా తీవ్ర అన్యాయం చేస్తోంది. దీన్ని ఈసారి సహించే ప్రసక్తే లేదు. కేంద్రంపై బహుముఖంగా ఒత్తిడి తెస్తాం. రైతు సమస్యలపై ఎంత దాకానైనా వెళ్తాం.

ఇదీ చూడండి:

ఎల్లుండి టీఆర్​ఎస్​ఎల్పీ భేటీ... అనంతరం దిల్లీకి సీఎం, మంత్రుల బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.