రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకి రానందున.. లాక్‌డౌన్‌లో కేంద్రం ప్రకటించిన మినహాయింపులు ఇవ్వలేమని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీకి వివరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఆధారంగా మే 7 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నామని చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో.. లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయం తీసుకున్న అనంతరం.. ఆయన ప్రధానితో మాట్లాడారు.
సడలిస్తే నియంత్రణ ఉండదు..
లాక్‌డౌన్ సడలిస్తే ఏ మాత్రం నియంత్రణ ఉండదని, వ్యాధి మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని ప్రధానికి సీఎం వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల దృష్ట్యా.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు ఇతరత్రా అంశాలను ఆయన వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచకపోవటం వల్ల.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని సీఎం తెలిపారు.
వ్యవసాయాన్ని ఆదుకోవాలి..
భవిష్యత్‌లో ఆహార నిల్వలను కాపాడుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కొన్ని నివేదికలు ఈ అంశాన్ని ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. అందుకనే అత్యధిక జనాభా ఉన్న భారత్‌కు.. ఆహార నిల్వల పరంగా సమస్య రాకుండా ఉండేందుకు.. వ్యవసాయాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం సూచించారు. గతంలో తాను సూచించిన.. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనను... మళ్లీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
పేదలు, వలస కూలీలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందో... ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోదీకి వివరించారు. అత్యవసర శాఖల ఉద్యోగులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఇవీ చూడండి: ఎలాంటి సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్‌డౌన్: కేసీఆర్