ETV Bharat / state

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు.. - కేసీఆర్​ ప్రచార షెడ్యూల్​

CM KCR Election Tour in Telangana : రాష్ట్రంలో ఎన్నికల కాక మొదలైంది. కోడ్ మొదలైందో లోదో పార్టీలన్ని ప్రచారంపై దృష్టి పెడుతున్నాయి. ఆదిలాబాద్​లో బీజేపీ ఇవాళ జనగర్జన సభ నిర్వహిస్తే.. ఈనెల 15 నుంచి బస్సుయాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక అధికార పార్టీ కూడా అదే రోజు నుంచి ప్రచార భేరీ మోగించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరోజు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నాయి. కేసీఆర్ 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.

CM KCR Election Tour in Telangana
CM KCR Election Tour in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 10:39 PM IST

Updated : Oct 10, 2023, 10:59 PM IST

CM KCR Election Tour in Telangana : ఎన్నికల నగారా మోగడంతోనే రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈనెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. రోజుకు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్​ పాల్గొనేలా బీఆర్​ఎస్(BRS) నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు.

ముందుగా హుస్నాబాద్‌లో కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్​ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 16న జనగామ, భువనగిరిలో జరిగే సభల(Public Meetings)కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.

CM KCR Campaign Schedule : ఈనెల 18న జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడుకు.. కేసీఆర్‌ వస్తారని బీఆర్​ఎస్ శ్రేణులు ప్రకటించారు. 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో కేసీఆర్‌ సభలు జరగనున్నాయి. ఈనెల 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండలో కేసీఆర్‌ సభలు నిర్వహించనున్నారు.

నవంబర్‌ 1న సత్తుపల్లి, ఇల్లందులో సభ నిర్వహించనున్నారు. నవంబర్‌ 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురిలో సభలు జరగనున్నాయి. నవంబర్‌ 3న భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల సభల్లో పాల్గొననున్నారు. నవంబర్‌ 5న కొత్తగూడెం, ఖమ్మంలో కేసీఆర్‌ సభలు హాజరుకానున్నారు. నవంబర్‌ 6న గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట్‌లో బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. నవంబర్‌ 7న చెన్నూర్‌, మంథని, పెద్దపల్లి సభల్లో జరగనున్నాయి. నవంబర్‌ 8న సిర్పూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి సభల్లో పాల్గొననున్నారు. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్నారు.

ముఖ్యమంత్రి సభల వివరాలు :

తేదీ సభ జరిగే జిల్లా
అక్టోబర్‌ 15 హుస్నాబాద్
అక్టోబర్‌ 16 జనగామ, భువనగిరి
అక్టోబర్‌ 17 సిద్దిపేట, సిరిసిల్ల
అక్టోబర్‌ 18 జడ్చర్ల, మేడ్చల్‌
అక్టోబర్‌ 26అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మునుగోడు
అక్టోబర్‌ 27పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌
అక్టోబర్‌ 29కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌
అక్టోబర్‌ 31హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 1సత్తుపల్లి, ఇల్లందు
నవంబర్‌ 2నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 3భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 5కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 6గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట్‌
నవంబర్‌ 7చెన్నూర్‌, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 8 సిర్పూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి
నవంబర్‌ 9గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేస్తారు.

BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. నవంబర్‌ 9న కేసీఆర్ నామినేషన్లు

CM KCR Suffering From Viral Fever : సీఎం కేసీఆర్‌ ఛాతిలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌.. ఇంకాస్త సమయం కావాలి

BRS Parliamentary Party meeting at Pragati Bhavan : చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి: సీఎం కేసీఆర్

Last Updated : Oct 10, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.