ETV Bharat / state

KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు

kcr
kcr
author img

By

Published : Oct 25, 2021, 12:44 PM IST

Updated : Oct 25, 2021, 1:39 PM IST

ప్రపంచ ఉద్యమాలకే... తెలంగాణ ఉద్యమం కొత్త భాష్యాన్ని.. కొత్త బాటను నేర్పిందని... తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఉద్యమ అనంతరం పాలన సాగించటం చాలా సంక్లిష్టతతో కూడుకన్నప్పటికీ... విజయవంతంగా రాణించగలిగామని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సభకు అనుమతి ఉన్న ప్రతినిధులతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

అహింసామార్గంలోనే తెలంగాణ సాధన

సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదు: కేసీఆర్

2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించామని... కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్​ అన్నారు. కొద్దిమంది మిత్రులతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని... స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని వెల్లడించారు. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశానని కేసీఆర్ అన్నారు. అహింసా మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యం చెప్పిందని కేసీఆర్​ అన్నారు.

తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశాం. ఎఫ్‌సీఐ కూడా మేం కొనలేమని చెప్పేస్థాయిలో వరి పండించాం. ఏఏరంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని చెప్పారో.. అదే రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్​లోని ప్రజలు తమను తెలంగాణలో కలపనమని కోరుతున్నారు. - సీఎం కేసీఆర్​

ఏపీలో చీకట్లు ఉంటే తెలంగాణ వెలుగుతోంది

ఏపీలో చీకట్లు ఉంటే తెలంగాణ వెలుగుతోంది: కేసీఆర్

మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలైతే... తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.35 లక్షలకు పెరిగిందని సీఎం కేసీఆర్​ అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కొందరు ఏపీ నేతలు అన్నారని... ఇప్పుడు ఏపీలోనే కరెంట్ ఉండటం లేదని కేసీఆర్​ ఎద్దేవా చేశారు. ఏపీలో చీకట్లు ఉంటే తెలంగాణ వెలుగుతోందని కేసీఆర్ అన్నారు.

ఏపీలో తెరాసను ప్రారంభించండి

దళితబంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్ఞాపనలు వస్తున్నాయి. తెలంగాణ పథకాలు మాకు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి వేలసంఖ్యలో కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. ఏఏరంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని చెప్పారో.. అదే రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్​లోని ప్రజలు తమను తెలంగాణలో కలపనమని కోరుతున్నారు. - కేసీఆర్, తెరాస అధ్యక్షుడు

గెల్లు గెలుపు ఖాయం

హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నవంబరు 4 తర్వాత హుజూరాబాద్ దళితులకు దళితబంధు అందిస్తారని కేసీఆర్ ప్రకటించారు. నవంబరు, డిసెంబర్‌లో దళితబంధును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఎవరికి ఏ పద్ధతిలో జవాబు చెప్పాలో ఆ పద్ధతిలోనే చెబుదామని కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు.

నవంబరు 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది

ఎన్నికల సంఘం చిల్లరమల్లర పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నా

కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. సాగర్ సభ పెట్టవద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించవద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది. ఎన్నికల సంఘం చిల్లరమల్లర పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది. ఒక సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను. ఎన్నికల సంఘం గౌరవప్రదంగా వ్యవహరించాలి. హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఈసీ ఏం చేసినా నవంబరు 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. నవంబర్​ నాలుగో తేదీన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ వచ్చి దళితబంధును అమలు చేస్తారు. - కేసీఆర్, తెరాస అధ్యక్షుడు

ఆర్థికపరంగా శక్తివంతమైన తెలంగాణ

తెరాస ఆర్థికపరంగా కూడా శక్తివంతంగా తయారైందని సీఎం కేసీఆర్ అన్నారు. తెరాసకు భారీగా విరాళాలు సమకూరాయని వెల్లడించారు. రూ.240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయని... చట్టబద్ధమైన విరాళాల ద్వారా పార్టీ కార్యకలాపాలు కొసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు. 31 జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని... ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని కేసీఆర్​ ప్రకటించారు. కాంగ్రెస్, భాజపా అధికారంలోకి వస్తే దళితబంధు ఇస్తాయా అని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.

తెరాస అధిష్ఠానం రాష్ట్ర ప్రజలే

దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుందని అడిగారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్ల ఖర్చు చేస్తాం... దళితబంధుతోనే ఆగిపోం... ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టాం. దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. దళితబంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తోంది. దళితబంధు ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా. దళితబంధులాంటి పథకం అమలు చేయాలంటే.. భాజపా, కాంగ్రెస్​లు చేయలేవు. వారి అధిష్ఠానం దిల్లీలో ఉంది. కానీ తెరాస అధిష్ఠానం రాష్ట్ర ప్రజలే. - కేసీఆర్, తెరాస అధ్యక్షుడు

Last Updated : Oct 25, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.