CM KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కంటి పరీక్షలు చేయించుకోనున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన కంటి పరీక్షలు చేయించుకోవాలని భావించినా నేత్ర వైద్య నిపుణుడు సచ్‌దేవ్ అందుబాటులో లేకపోవడంతో నేటికి వాయిదా పడింది. కేసీఆర్ సతీమణి శోభ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేటి కంటి పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి దంపతులు తిరిగి హైదరాబాద్ రానున్నారు.
దంతవైద్యం చేయించుకున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో మంగళవారం దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి పలు విపక్ష పార్టీల నేతలను కలుస్తారనే ప్రచారం సాగినా అందుకు సంబంధించిన ఎటువంటి కదలికలు కనిపించలేదు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, రాజకీయపరమైనది కాదని తెరాసకు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
ఇదీ చదవండి: