ETV Bharat / state

JPS Regularization : 'పనితీరు ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ' - హైదరాబాద్‌ తాజా వార్తలు

CM KCR on JPS Regularization : రాష్ట్రప్రభుత్వం జేపీఎస్‌లకు తీపికబురు అందించింది. నాలుగేళ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అదేవిధంగా వీఆర్‌ఏలను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ప్రభుత్వం.. కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 12, 2023, 7:27 AM IST

Telangana Government Decision to regularize JPS : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ సమ్మె చేసిన జేపీఎస్‌ల కలసాకారం కానుంది. వారి ఉద్యోగాల క్రమబద్దీకరణకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. నాలుగేళ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జేపీఎస్‌ల క్రమబద్దీకరణపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో కార్యదర్శుల కృషి ఇమిడి ఉందని అన్నారు.

సాధించిన దానితో సంతృప్తి చెంది అలసత్వం వహించకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో ఇంకా అభివృద్ధి చెందే దిశగా పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందన్నారు.

నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న వారిని క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Adjustment of VRA and VOAs : గ్రామ రెవెన్యూ సహాయకులు - వీఆర్‌ఏలను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఇవాళ్టి నుంచి కసరత్తు ప్రారంభించనుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం... వీఆర్‌ఏల విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. వీఆర్‌ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్‌ఏలతో ఇవాళ్టి నుంచి చర్చలు ప్రారంభించాలని తెలిపారు. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోనున్నారు.

వీఆర్‌ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.