వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న పలు పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బంగాల్‌లో వరుసగా మూడోసారి తన పార్టీని గెలిపించి హ్యాట్రిక్’ సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అభినందనలు తెలిపారు.
తమిళనాడులో డీఎంకే కూటమిని విజయతీరాల వైపు నడిపించి, పదేళ్ల విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌కు, కేరళ రాష్ట్రంలో విజయాన్ని చేజిక్కించుకున్న ఎల్‌డీఎఫ్ కూటమికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కేరళ సీపీఎం నేత పినరయి విజయన్, అస్సాంలో విజయం సాధించిన భాజపా నేత సర్భానంద సోనోవాల్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.