భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-49 విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి భారత్‌కు చెందిన ఈవోఎస్-01 శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఈవోఎస్తో పాటు మరో తొమ్మిది ఉపగ్రహాలను ఓకేసారి ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను, సాంకేతిక సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.