ETV Bharat / state

రాహుల్​పై అనర్హత వేటు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: కేసీఆర్‌

author img

By

Published : Mar 24, 2023, 5:17 PM IST

Updated : Mar 24, 2023, 7:10 PM IST

CM KCR Condemned Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. రాహుల్‌పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని తెలిపారు. ఈ చర్య ప్రధాని మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని హెచ్చరించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ సైతం తన నిరసనను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

cm kcr
cm kcr

CM KCR Condemned Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీపై లోక్‌సభకు రాకుండా అనర్హత వేటు వేయడంతో.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అని అభివర్ణించారు. మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కేసీఆర్‌ అన్నారు. ఇటువంటి దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని చెప్పారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌: అంతకు ముందు ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం అని కేటీఆర్‌ ట్విటర్‌లో ట్వీట్‌ ద్వారా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అనేది.. పూర్తిగా రాజ్యాంగాన్ని వక్రీకరించే విధంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ ఈ విషయంలో తొందరపాటుగా వ్యవహరించిందని.. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఈ సందేశం పంపుతూ "నువ్వు చెప్పినదాన్ని నేను అంగీకరించను కానీ.. నీకు మాట్లాడే హక్కు ఉందని నా ఆఖరి క్షణం వరకు పోరాడుతాను అన్న.. ఫ్రెంచ్‌ రచయిత వోల్టేర్‌ మాటలను కోట్‌ చేశారు. దీంతో పాటు జర్మన్‌ థీయోలాజియన్‌ మార్టిన్‌ నీమోల్లర్‌ మాటలను సైతం పోస్ట్‌ చేశారు.

మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌: రాహుల్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసే రాహుల్‌ గాంధీపై వేటు వేశారని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చే మోదీ మిషన్‌లో భాగంగానే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. వైఫల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ యత్నమని మండిపడ్డారు. విపక్షాలపై అణచివేత దృష్టిని మళ్లించేందుకే ఈ అనర్హత వేటుఅని అభిప్రాయపడ్డారు.

  • Disqualification of @RahulGandhi Ji from Parliament is dictatorship and arrogance of BJP.

    Democracy - under threat
    Constitutional rights - under threat

    — Harish Rao Thanneeru (@BRSHarish) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="

Disqualification of @RahulGandhi Ji from Parliament is dictatorship and arrogance of BJP.

Democracy - under threat
Constitutional rights - under threat

— Harish Rao Thanneeru (@BRSHarish) March 24, 2023 ">

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వ పాలనకు, అహంకార ధోరణికి నిదర్శనమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాహుల్ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మంత్రి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు పెను ప్రమాదంలో ఉన్నాయన్నారు.

  • Revoking the membership of @RahulGandhi Ji, despite knowing that he has a chance to appeal in the upper courts, is a blot on democrary. This is a larger part of Modi Ji’s mission of diverting people’s attention from his failures, corrupt friends & suppressing the opposition. pic.twitter.com/kUOjnyF84P

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో చీకటి రోజులు: రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వానికి పరాకాష్ట అని మంత్రి జగదీశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో మోదీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని తెలిపారు. దేశంలో చీకటి రోజులు వచ్చాయని.. అణచివేతను మోదీ సర్కార్‌ ఎంచుకున్న మార్గమని దుయ్యబట్టారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తంతు ఇదే అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను ఎదగకుండా చేయడానికి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను వినియోగించుకున్నారని మండిపడ్డారు. తొందరలోనే బీజేపీ దుర్మార్గాలకు ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

CM KCR Condemned Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీపై లోక్‌సభకు రాకుండా అనర్హత వేటు వేయడంతో.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అని అభివర్ణించారు. మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కేసీఆర్‌ అన్నారు. ఇటువంటి దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని చెప్పారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌: అంతకు ముందు ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం అని కేటీఆర్‌ ట్విటర్‌లో ట్వీట్‌ ద్వారా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అనేది.. పూర్తిగా రాజ్యాంగాన్ని వక్రీకరించే విధంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ ఈ విషయంలో తొందరపాటుగా వ్యవహరించిందని.. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఈ సందేశం పంపుతూ "నువ్వు చెప్పినదాన్ని నేను అంగీకరించను కానీ.. నీకు మాట్లాడే హక్కు ఉందని నా ఆఖరి క్షణం వరకు పోరాడుతాను అన్న.. ఫ్రెంచ్‌ రచయిత వోల్టేర్‌ మాటలను కోట్‌ చేశారు. దీంతో పాటు జర్మన్‌ థీయోలాజియన్‌ మార్టిన్‌ నీమోల్లర్‌ మాటలను సైతం పోస్ట్‌ చేశారు.

మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌: రాహుల్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసే రాహుల్‌ గాంధీపై వేటు వేశారని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చే మోదీ మిషన్‌లో భాగంగానే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. వైఫల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ యత్నమని మండిపడ్డారు. విపక్షాలపై అణచివేత దృష్టిని మళ్లించేందుకే ఈ అనర్హత వేటుఅని అభిప్రాయపడ్డారు.

  • Disqualification of @RahulGandhi Ji from Parliament is dictatorship and arrogance of BJP.

    Democracy - under threat
    Constitutional rights - under threat

    — Harish Rao Thanneeru (@BRSHarish) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వ పాలనకు, అహంకార ధోరణికి నిదర్శనమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాహుల్ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మంత్రి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు పెను ప్రమాదంలో ఉన్నాయన్నారు.

  • Revoking the membership of @RahulGandhi Ji, despite knowing that he has a chance to appeal in the upper courts, is a blot on democrary. This is a larger part of Modi Ji’s mission of diverting people’s attention from his failures, corrupt friends & suppressing the opposition. pic.twitter.com/kUOjnyF84P

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో చీకటి రోజులు: రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వానికి పరాకాష్ట అని మంత్రి జగదీశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో మోదీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని తెలిపారు. దేశంలో చీకటి రోజులు వచ్చాయని.. అణచివేతను మోదీ సర్కార్‌ ఎంచుకున్న మార్గమని దుయ్యబట్టారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తంతు ఇదే అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను ఎదగకుండా చేయడానికి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను వినియోగించుకున్నారని మండిపడ్డారు. తొందరలోనే బీజేపీ దుర్మార్గాలకు ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 24, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.