తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ఆచార్య జయశంకర్ సదా స్మరణీయుడని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు.
జయశంకర్ ఆశించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే ఆయన ఆశయ సాధన అని కేసీఆర్ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రులు, ఇతర నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు