ETV Bharat / state

CM KCR on Early Polls: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

CM KCR on Early Polls: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కచ్చితంగా తెరాస ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు సర్వే ద్వారా ఇచ్చిన నివేదిక మేరకు.. తెరాస భారీ విజయాన్ని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

CM KCR on Early Polls
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్
author img

By

Published : Mar 21, 2022, 6:54 PM IST

Updated : Mar 21, 2022, 7:20 PM IST

CM KCR on Early Polls: రాష్ట్రంలో ఈసారి ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని పేర్కొన్నారు. గతంలో తెరాస పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, అమలు చేయాల్సిన పథకాలు ఉన్నందునే.. అసెంబ్లీని రద్దు చేయాల్సివచ్చిందన్నారు. ఈ సారి ఆ అవసరం లేదని.. అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కచ్చితంగా తెరాస ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. రానున్న ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సీట్లు దక్కించుకుంటామని స్పష్టం చేశారు.

ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు: సీఎం

నివేదికలో స్పష్టం

వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయని.. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని నివేదిక వెల్లడించిందని చెప్పారు. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. నివేదిక మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోందన్నారు. మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తామని ప్రకటించారు.

"ఈసారి మేము 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని నివేదిక చెబుతోంది. ఈ మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోంది. మరో 25 రోజుల్లో ఆ నివేదిక బహిర్గతం చేస్తాం." -సీఎం కేసీఆర్

పీకే మంచి స్నేహితుడు

జాతీయ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు స్పందించిన సీఎం.. కేసీఆర్ అవసరం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తానని వ్యాఖ్యానించారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఎనిమిదేళ్లుగా తనకు మంచి స్నేహితుడని చెప్పిన కేసీఆర్.. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పనులు చేయరని పేర్కొన్నారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉందని చెప్పారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నానని.. తన ఆహ్వానం మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: CM KCR on Kashmir Files: 'ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం'

Last Updated : Mar 21, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.