ETV Bharat / state

CM KCR: కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న సీఎం కేసీఆర్‌ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ప్రగతి భవన్‌లో వినాయక చవితి(Ganesh chaturthi) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్(cm kcr) దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి కేటీఆర్‌(ktr) సతీసమేతంగా పాల్గొన్నారు.

CM KCR participated in ganesh chaturthi, ganesh chaturthi at pragathi bhavan
ప్రగతి భవన్‌లో గణేశ్ చతుర్థి వేడుకలు, వినాయకుడికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
author img

By

Published : Sep 10, 2021, 4:59 PM IST

Updated : Sep 10, 2021, 7:24 PM IST

ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr) కుటుంబసభ్యులతో కలిసి వినాయక చవితి(ganesh chaturthi) వేడుకలు జరుపుకున్నారు. గణేశ్ చతుర్థిని పురస్కరించుకొని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ప్రతిష్ఠించిన మట్టి గణపయ్యకు(clay ganesh) పూజలు చేశారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌(ktr), రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌(mp santhosh kumar) వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ సతీసమేతంగా పూజలు చేశారు.

CM KCR participated in ganesh chaturthi, ganesh chaturthi at pragathi bhavan
సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు

రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు కోలహలంగా జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు. వినాయకచవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్​ మహాగణపతికి గవర్నర్​ తమిళిసై, హరియాణా గవర్నర్​ దత్తాత్రేయ తొలిపూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి... సికింద్రాబాద్ గణేశ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్​ గణపతి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయమని మంత్రులు పేర్కొన్నారు.

కుటుంబ సమేతంగా మంత్రి కేటీఆర్ పూజలు

ఇదీ చదవండి: Vinayaka Chavithi: రాష్ట్రవ్యాప్తంగా చవితి సంబరాలు.. గల్లీల్లో గణేశుల సందళ్లు

Last Updated : Sep 10, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.