పదహారు స్థానాల్లో విజయమే లక్ష్యంగా.. కేసీఆర్ నేటి నుంచి రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి బయలు దేరనున్నారు.ఈరోజు నుంచి ఏప్రిల్ 4 వరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఐదున్నరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభలో ప్రసంగిస్తారు.ప్రచారానికి సర్వం సిద్ధం
ఈరోజు మిర్యాలగూడ, హైదరాబాద్‌లలో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు