Cm Kcr Birthday Celebrations: ముఖ్యమంత్రి కేసీఆర్... 68వ పుట్టినరోజు వేడుకలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వినూత్నంగా జరిపారు. ఒడిశా పూరి సముద్రతీరంలో ప్రముఖ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు సైకత శిల్పాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు. 20 టన్నుల ఇసుకను, 20 అడుగుల వెడల్పుతో చూడగానే ఆకట్టుకునేలా హృద్యంగా తీర్చిదిద్దారు. కలకాలం కేసీఆర్ బతకాలని ఆకాంక్షిస్తూ సీఎం చిత్రాన్ని అందులో పొందుపరిచారు. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆకాంక్షించారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.
Birth Day Wishes to CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోకేను పంపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. సీఎంకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేసీఆర్ సదా ఆరోగ్యంగా జీవించాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనుకున్న లక్ష్యాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: Birth Day Wishes to CM KCR : కేసీఆర్‌కు వెల్లువలా జన్మదిన శుభాకాంక్షలు