సీతారామ ప్రాజెక్ట్‌తో ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంత్రి అజయ్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భంలో ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.
ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని మంత్రి అజయ్ తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం'