ETV Bharat / state

Secretariat Inauguration: సీఎం కేసీఆర్ సహా మంత్రుల సంతకాలు వీటిపైనే..! - తెలంగాణ నూతన సచివాలయం ప్రారంబోత్సవం

Telangana New Secretariat Inauguration Today: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నూతన వేదిక సర్వాంగ సుందరంగా నేడు ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. సీఎం కేసీఆర్, మంత్రులు పలు దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. దళితబంధు రెండో విడత కింద 2023-24 ఏడాదికి నియోజకవర్గానికిి 1100 మంది చొప్పున లబ్ధిదారులకు రూ.10 లక్షల సహాయం చేసేందుకు కేసీఆర్ అనుమతి ఇవ్వనున్నారు. సీఎం తొలి సంతకం దీనిపైనే చేయనున్నట్లు తెలిసింది.

CM KCR
CM KCR
author img

By

Published : Apr 30, 2023, 8:50 AM IST

Updated : Apr 30, 2023, 8:58 AM IST

Telangana New Secretariat Inauguration Today: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పేదలు, సంక్షేమ వర్గాలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పలు దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. దళితబంధు రెండో విడత కింద 2023-24 సంవత్సరానికి నియోజకవర్గానికిి 1100 మంది చొప్పున లబ్ధిదారులకు రూ.10 లక్షల సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వనున్నారు. సీఎం తొలి సంతకం దీనిపైనే చేయనున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. దీంతో హుజూరాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో 1100 మందికి లబ్ధి చేకూరనుంది.

  • మంత్రి కేటీఆర్‌.. హైదరాబాద్‌లో లక్ష మందికి డబుల్‌ బెడ్‌ రూం గృహాల పంపిణీకి మార్గదర్శకాలపై తన తొలి సంతకం చేయనున్నారు. మంత్రి కార్యాలయం సచివాలయంలోని మూడో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు.
  • గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పోడు భూములకు సంబంధించి పట్టాల పంపిణీకి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. పోడు దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కమిటీలు తొలి విడత కింద 4 లక్షల ఎకరాల అటవీ భూమిపై 1.55 లక్షల మంది గిరిజనులు హక్కులు పొందేందుకు అర్హులని గుర్తించాయి. గిరిజనులకు పంపిణీ చేసేందుకు వీలుగా హక్కు పత్రాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా చేసింది. అయితే వీటి పంపిణీ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
  • ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై ఆ శాఖ మంత్రి తన తొలి సంతకం చేయనున్నారు.
  • రాష్ట్రంలో ఎంబీసీ, బీసీలకు అయిదేళ్లుగా స్వయం ఉపాధి రుణాల పంపిణీ నిలిచిపోయింది. బడ్జెట్లలో ఆయా కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కాగితాలకే పరిమితమయ్యాయి. కార్పొరేషన్‌ రుణాల కోసం 2017లో దాదాపు 7 లక్షల మందికి పైగా బీసీలు దరఖాస్తు చేసుకుని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి రుణాల మంజూరుకుగానూ రంగం సిద్ధమైంది. అయితే ఈ రెండు కార్పొరేషన్ల కింద రూ.600 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను ఆమోదించే అవకాశాలున్నాయి.

1-3 ఏళ్లలోపు చిన్నారులకు పాలు: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి 3 ఏళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పాలు అందించే విషయమై మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రస్తుతం 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలామృతాన్ని అందిస్తోంది. అలాగే నెలకు 16 కోడిగుడ్లు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు చిన్నారులకు 200 మి.లీ. పాలను కూడా అందించాలని సంక్షేమ శాఖ భావిస్తోంది. దీంతో 9 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. అంగన్‌వాడీల సిబ్బందికి పదవీ విరమణ కాలం 61 ఏళ్లుగా నిర్ణయించడంతో పాటు మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేసే విషయాన్ని కూడా ఈ శాఖ పరిశీలిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 30, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.