ETV Bharat / state

'అసత్యాలు వద్దు'... 'మీరు ఆరోగ్యంగా ఉండాలి' - clp leader bhatti speech in assembly

ముఖ్యమంత్రి కేసీఆర్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రతిపక్షాలు సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నాయని సీఎం అంటే... ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలు
author img

By

Published : Sep 15, 2019, 5:01 PM IST

ప్రతిపక్షాలు ప్రాజెక్టుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని... పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శిస్తే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్​ అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సత్య దూరమైన విషయాలు మాట్లాడడం వల్లే తాను శనివారం సభలో పరుషంగా మాట్లాడానని పేర్కొన్నారు. తప్పులు ఉంటే చెప్పాలని... వాటిని సరిచేసుకుంటామని అంతే తప్ప అసత్యాలు చెప్పొద్దని సూచించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ సీఎం కేసీఆర్​ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తాము అసత్యాలు చెప్పలేదని ప్రాజెక్టులపై అధికారులతో మరోసారి సమీక్షించాలని కోరారు.

'అసత్యాలు వద్దు'... 'మీరు ఆరోగ్యంగా ఉండాలి'

ఇదీ చూడండి : యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.