ETV Bharat / state

CM KCR: వద్దనుకున్నా లాక్​డౌన్​ తప్పడం లేదు: కేసీఆర్​ - cm kcr about lockdown extension

లాక్​డౌన్​తో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గినా ప్రజల ప్రాణాలే ముఖ్యమని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అందుకే ఇష్టం లేకున్నా లాక్​డౌన్​ కొనసాగించాల్సి వస్తోందని అన్నారు. లాక్​డౌన్ కొనసాగింపు చేయాలా వద్దా అనే అంశంపై ఆదివారం మంత్రి మండలితో సమావేశం నిర్ణయించిన ఆయన.. మంత్రులకు పలు సూచనలు చేశారు. మరో పదిరోజుల పాటు లాక్​డౌన్​ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మినహాయింపు సమయాన్ని మరో 3 గంటలు పెంచారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో చర్చించారు.

cm kcr on lockdown extension
లాక్​డౌన్​ పొడిగింపుపై సీఎం కేసీఆర్​
author img

By

Published : May 31, 2021, 8:46 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వద్దనుకున్నా... ప్రజల ఆరోగ్య సంక్షరణ కోసం తప్పనిసరై కొనసాగించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదాయం తగ్గినా పౌరుల ప్రాణాలే ముఖ్యమని, అందుకే కఠిన చర్యలకూ వెనుకాడటం లేదని అన్నారు. కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొంటూనే వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తామని చెప్పారు. సాగునీటి వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తామన్నారు. మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు, ఆమోదాల అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు. గత 18 రోజుల వ్యవధిలో భారీగా ఆదాయం పోయింది. అందుకే మళ్లీ రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నాం. భూములు, ఇళ్ల అమ్మకాలకు అనుమతించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఫలితాలు

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్న ఆయన.. మంత్రులు జిల్లాల్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించడం వల్ల మేలైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. వారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని.. లాక్‌డౌన్‌ ముగిసే వరకు జిల్లాల్లో ఉండి రోగులకు వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అందరికీ, అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగస్వాములు కాకుండా కొంత మంది అత్యాశతో, స్వార్థంతో సొంతదారి వెతుక్కొని కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. అది వారి ఖర్మ.

- సీఎం కేసీఆర్‌

అజయ్‌.. మల్లారెడ్డి సలహాలివ్వాలి

'రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు వైద్య కళాశాలలను మంజూరు చేశాం. కేంద్రం.. దేశంలో 150 కళాశాలలు ఇచ్చినా అందులో మనకు ఒక్కటీ రాలేదు. మన అవసరాలు మనమే తీర్చుకోవాలనుకొని కొత్తవి చేపడుతున్నాం. ఒక్కోదానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం ఏడు కళాశాలల ఏర్పాటుకు రూ.అయిదు వేల కోట్లు అవసరం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా వీటిని వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. ఈ జులైలో కళాశాలలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటాం. 2022 జులై నాటికి నిర్మాణాలు పూర్తయితే అనుమతులు మంజూరవుతాయి. ఒక్కో కళాశాలలో 200కి తగ్గకుండా ఎంబీబీఎస్‌ సీట్లు రావాలి. ఈ ఏర్పాట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. వైద్య కళాశాలలను నిర్వహిస్తున్న మంత్రులు పువ్వాడ అజయ్‌, మల్లారెడ్డిలు దీనికి సంబంధించిన సలహాలు ఇవ్వాలి. మున్ముందు అవసరమైన చోట మరిన్ని వైద్య కళాశాలలను మంజూరు చేస్తాం’ అని సీఎం అన్నారు.

అయిదు గంటల పాటు సమావేశం

మంత్రిమండలి సమావేశం అయిదు గంటల పాటు సాగింది. సమావేశంలో వైద్యకళాశాలల ప్రస్తావన వచ్చినప్పుడు వాటి ఏర్పాటు విధానం గురించి సీఎం.. మంత్రి పువ్వాడతో మాట్లాడించారు. వైద్య కళాశాలలు మరిన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రులు కోరారు.

ఇదీ చదవండి: అనిశాకు చిక్కిన జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ డీఈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.