తన ఆరోగ్యంపై పలువురు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి... మరో మూడు దఫాలు రాష్ట్రంలో తెరాస ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తన వయసు ఇప్పుడు 66 ఏళ్లు అని... ఇంకో పదేళ్లు తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను దిగిపోయి కేటీఆర్‌ను ఎందుకు సీఎంను చేస్తానని అన్నారు. ప్రజల దీవెన... దేవుడి దయతో బాగుంటానని వెల్లడించారు. తమ తప్పులు ఉంటే చెప్పండి సవరించుకుంటామన్నారు. రాష్ట్ర పరువును బజారున పెట్టొద్దని తెలిపారు.
ఇవీ చూడండి: రైతుల కోసం జగన్‌తో కలిసి పనిచేస్తాం: సీఎం కేసీఆర్