కరోనా టీకాలపై ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు టీకా కార్యక్రమం జరగాలని లేఖలో కోరారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని మా నిర్ణయం. టీకా కొరతతో ప్రస్తుతం 45 ఏళ్ల వారికే ప్రాధాన్యం ఇస్తున్నాం. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించలేకపోయాం. ఇలాంటి స్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రభుత్వ నియంత్రణ లేకుంటే టీకాలను నల్లబజారుకు తరలిస్తారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారు.?. సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు టీకా కార్యక్రమం జరగాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఇదీ చదవండి: కరోనా వికృత క్రీడలో ఛిద్రమవుతున్న కుటుంబాలు..!