ETV Bharat / state

ప్రజాబలంతో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్​ - cm jagan news

ఆంధ్రప్రదేశ్​ని సర్వతోముఖాభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.... అందుకు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం.. సుపరిపాలన దిశగా సాగుతున్నట్లు వెల్లడించారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని... ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఏపీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. 17 నెలల పాలనలో గ్రామాల రూపు రేఖలను మార్చామన్న సీఎం.. గ్రామం యూనిట్​గా అభివృద్ధి కొనసాగిస్తామని పేర్కొన్నారు.

cm-jagan-speech-on-state-formation-day
ప్రజాబలంతో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్​
author img

By

Published : Nov 1, 2020, 6:14 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్..‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎందరో త్యాగం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి నేటికి 64 ఏళ్లు పూర్తైందని..అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. 1956 నవంబర్ 1న రాష్ట్రం ఏర్పడటం వెనుక గొప్ప చరిత్ర ఉందన్నారు. రాష్ట్ర సాధనకోసం 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర బంగారు భవిత కోసం ఎందరో త్యాగం చేశారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా దగాపడిన రాష్ట్రం మనదేనన్నారు. బయటివారి కత్తి గాట్లు, సొంత వారి వెన్నుపోట్లతో రాష్ట్రం తల్లడిల్లిందని ఆవేదన వెలిబుచ్చారు.

రాష్ట్రంలో నేటికీ 33 శాతం చదువు రానివారు ఉన్నారని, దాదాపు 85 శాతం ప్రజలు తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారని సీఎం తెలిపారు. 32 లక్షల మంది నిరుపేదలు ఆవాసం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 90 లక్షల మంది అక్కాచెల్లెల్లు స్వావలంబన కోసం సమరం చేస్తున్నారని, కోటి ఎకరాల్లో ఒక పంటకు కూడా నీటి సదుపాయం లేకుండా ఉన్నాయని వివరించారు. పిల్లల చదువులు, వైద్యం కోసం గతంలో ఆస్తులు అమ్మకునే పరిస్ధితులు ఉండేవని, ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవలకు వారు నోచుకోని పరిస్ధితి ఉండేదన్నారు. గ్రామ గ్రామాన ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన కర్తవ్యాన్ని ఈ సమస్యలు గుర్తు చేస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి పారుదల రంగాలపై వాస్తవిక దృక్పధంతో దృష్టి పెట్టామని వెల్లడించారు.

గ్రామాల రూపురేఖలు మార్చేలా చర్యలు

17 నెలల ప్రయాణంలో గ్రామాల రూపు రేఖలు మార్చేలా ముందుకు సాగామని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామాలను యూనిట్​గా తీసుకుని అభివృద్ధి కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో 2 వేల జనాభాకు ఓ సచివాలయం ఏర్పాటు, 50 మందికి ఓ వాలంటీర్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్నామని వివరించారు. ఇంగ్లీష్ మీడియం కోసం పాఠశాలలను అభివృద్ధి చేశామని, వైద్యం కోసం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్​లు ఏర్పాటు చేశామని చెప్పారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులను వెన్నంటి నడిపించేలా ఆర్బీకేలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

వివక్ష, అవినీతికి తావులేని పాలన

ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం.. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలేవీ చూడకుండా పథకాలు వర్తింప జేస్తున్నామన్నారు. అవినీతి, వివక్ష ఎక్కడా లేకుండా 17 నెలలుగా పాలన సాగుతోందని సగర్వంగా చెబుతున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో మహా యజ్ఞం జరుగుతోందని.. అడ్డుకనేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపేది లేదన్నారు. ప్రస్తుతం సమస్యలు, సవాళ్లు ఉన్నాయని అయినా కర్తవ్యం పవిత్రమైందిగా భావించి ముందకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

లక్ష్యం ఉన్నతమైంది కాబట్టే ప్రజా బలంతో మార్గం వేయగలం, దేవుని ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ స్టార్టప్​లతో.. ఏ పరీక్షకైనా ఇంట్లోనే చదువుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.