ETV Bharat / state

'మే చివరికల్లా పోలవరం కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలి'

పోలవరం ప్రాజెక్టు కీలక పనులపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నదుల అనుసంధానంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

cm-jagan-review-on-polavaram-project-works
మే చివరికల్లా పోలవరం కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలి: సీఎం జగన్​
author img

By

Published : Mar 1, 2021, 7:55 PM IST

పోలవరం స్పిల్‌వే, అప్రోచ్‌ ఛానల్, కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్లపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే చివరికల్లా కాఫర్‌ డ్యాం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పోలవరం స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని పేర్కొన్నారు.

అసంపూర్తిగా ఉన్న కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సమీక్ష చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపు ప్రచారంపై సమావేశంలో చర్చ జరిగింది. పోలవరం ఎత్తు తగ్గించేందుకు అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయం స్పష్టం చేసిందని జగన్​కు తెలిపారు. నిర్దేశిత ఎత్తుకు తగినట్లు షట్టర్ల బిగింపు పూర్తవుతోందని అధికారుల వెల్లడించారు.

ఈ సందర్భంగా నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఉండాలని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ఉండాలన్నారు. అయోమయం, సందిగ్ధత లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపుదామన్న ముఖ్యమంత్రి.. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి అనుసంధాన ప్రతిపాదనలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి: విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.