ETV Bharat / state

ఆనందయ్య కరోనా మందుపై త్వరగా నివేదిక ఇవ్వండి: ఏపీ సీఎం జగన్ - సీఎం జగన్ సమీక్ష

ఏపీలోని కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై ఆ రాష్ట్ర సీఎం జగన్ సమీక్షించారు. ఈ మేరకు ఆనందయ్య ఔషధంతో ఏమైనా సమస్యలున్నాయా అనే దానిపై ఆయుష్ అధికారులతో చర్చించారు. ఔషధంపై నిపుణులతో పరిశీలన చేయించాలని.. త్వరగా నివేదిక ఇవాలని ఆదేశించారు.

ap cm jagan
ఏపీ ముఖ్యమంత్రి
author img

By

Published : May 24, 2021, 8:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న మందుపై వీలైనంత త్వరగా పరిశీలన జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆదేశించారు. కంటిలో వేసే డ్రాప్స్‌పై వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలన్నారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక అందించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.