ETV Bharat / state

కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవం: ఏపీ సీఎం జగన్

author img

By

Published : May 5, 2020, 7:12 PM IST

కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనం సాగించాలన్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్షించారు. నిర్ధరణ పరీక్షల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని చెప్పారు.

jagan
కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవం: ఏపీ సీఎం జగన్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు- నేడు, హౌసింగ్, ఉపాధి హామీ, కరోనా నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి సమీక్షించారు.

కరోనా పరీక్షల సంఖ్యలో దేశంలో ఏపీదే మొదటి స్థానమన్న సీఎం... ప్రతి పదిలక్షల జనాభాకు రికార్డు స్థాయిలో 2,500కు పైగా టెస్టులు చేశామన్నారు. కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేశామన్నారు. కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయమని మరోసారి స్పష్టంచేశారు. దగ్గడమో, తుమ్మడమో చేస్తే.. అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందన్నారు. కరోనా మరణాల రేటు 2 శాతం లోపే ఉందని సీఎం జగన్‌ తెలిపారు.

వైరస్ వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు అడుగులు వేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షకు మందికి పైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని అంచనాలు చెబుతున్నాయని జగన్ తెలిపారు. లక్షల మంది ఇతరులు కూడా ఉంటారన్నారు. వివిధ దేశాల నుంచి కూడా రాష్ట్రానికి చెందిన వారిని ఆయా దేశాలు పంపుతున్నాయని చెప్పారు.

ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే క్వారంటైన్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయా కేంద్రాల్లో బెడ్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, భోజనం అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ పనులు జరగాలని చెప్పారు.

క్వారంటైన్ సదుపాయాలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. సదుపాయాలు బాగుంటేనే.. ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారన్నారు.

త్వరలో విలేజ్​ క్లినిక్స్

టెలీ మెడిసిన్‌పై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టెలీ మెడిసిన్‌ నంబర్లు ఉంచాలని అధికారులకు సూచించారు. త్వరలో విలేజ్‌ క్లినిక్‌ ప్రారంభిస్తామన్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు 75 శాతం ధర పెంచామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. దిల్లీ 70శాతం పెంచిందన్నారు. అందుకే 75 శాతం పెంచి గట్టి చర్యలు చేపట్టామన్నారు.

దుకాణాల సంఖ్య 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మద్యం దుకాణాలు మొత్తం 33 శాతం తగ్గించినట్లు తెలిపారు. మద్యం రేట్లు షాక్‌ కొట్టేలా ఉండాలని ఈ నిర్ణయాలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. పక్కరాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాలు ఉండకూడదన్నారు. వీటిపై నిర్లక్ష్యం వద్దని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించారు.

ఇవీ చూడండి: 'సాయంత్రంలోపు మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.