AP CM jagan launch news pension: ఏపీలో వృద్ధాప్య, వితంతు సహా పలు పింఛన్ల లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తోన్న రూ. 2,250కు అదనంగా రూ. 250 పెంచారు. ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు రూ. 2,500 అందించనున్నారు. ఎన్నికల సమయంలో వృద్ధులకు నెలకు రూ. 2 వేలు పింఛన్‌ను క్రమంగా 3 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజు 250 రూపాయలు పెంచారు.
ఈమేరకు సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీఐపీ, ప్రజలు కూర్చునే గ్యాలరీలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేందుకు రహదారిని నిర్మించారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదికకు వెళ్లే ప్రధాన రహదారిలో భద్రత ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్.. ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి: నాలుగోరోజు రైతుబంధు సాయం.. 6 లక్షలకు పైగా రైతులకు లబ్ధి