CM jagan Meeting with NTR District Leaders in AP: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తతోనూ విడిగా మాట్లాడిన జగన్.. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని స్పష్టం చేశారు.
జనవరిలో గ్రామాల్లో బూత్ కమిటీలు ఏర్పడిన అనంతరం నాయకులు, కార్యకర్తలు.. మరింత వేగంగా అడుగులు వేయాలని సీఎం తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో 89 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతునట్లు సీఎం వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని జగన్ సూచించారు.
ఇవీ చదవండి: