ఏపీలోని విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని.. నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాత్రి 11:30 గంటలకు రియాక్టర్ వద్ద లీకేజీ కారణంగా ప్రమాదం జరిగినట్లు వివరించారు.
ముందు జాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీని షట్‌డౌన్ చేయించామని అన్నారు. ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ ఉన్న విభాగానికే పరిమితమని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 59 చైనా యాప్‌లపై నిషేధం