ETV Bharat / state

"కేంద్రంతో మా బంధం.. అదే".. మోదీ బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు - కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Cm Jagan Comments in Modi Meeting: విభజన గాయాల నుంచి ఏపీ రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సీఎం జగన్‌ అన్నారు. కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Cm Jagan Comments in Modi Meeting
Cm Jagan Comments in Modi Meeting
author img

By

Published : Nov 12, 2022, 2:33 PM IST

"కేంద్రంతో మా బంధం.. అదే" మోదీ బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు

Cm Jagan Comments in Modi Meeting: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల జనసంద్రాన్ని తలపిస్తోందన్నారు. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జనం.. ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చిందని వెల్లడించారు. విజయనగరం వాసి మహాకవి గురజాడ మాటలు కర్తవ్య బోధ చేస్తున్నాయని తెలిపారు. ఇవాళ దాదాపు రూ.10 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యావాదాలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో తమ ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని పేర్కొన్నారు.

"విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తోంది. ఏపీకి మరిన్ని సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరుతున్నా. విభజన గాయాల నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం. మాకు.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు"- సీఎం జగన్‌

మీరు చూపే ప్రేమను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు: రాష్ట్రానికి మరిన్ని సహయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలిపారు. విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం.. పార్టీలు, రాజకీయాలకు అతీతమని సీఎం తెలిపారు. తమకు.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. పెద్దమనస్సుతో మీరు చూపే ప్రేమను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.